వార్తలు

Cold Moon 2020: అరుదైన పూర్ణ చందమామ... మిస్సవ్వకండి... పూర్తి వివరాలు ఇవీ

Cold Moon 2020: అంతరిక్షంలో జరిగే అద్భుతాలు మనం కోరినప్పుడు రావు... అవి వచ్చినప్పుడే మనం వాటిని చూడగలం. మిస్సైతే... మళ్లీ చూద్దామన్నా ఛాన్స్ రాదు. మరి అరుదైన పూర్ణ చందమామ విశేషాలు తెలుసుకుందాం.


ఉద్యోగులకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్.. ఒకట్రెండు రోజుల్లోనే ఆ కీలక ప్రకటన?

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తర్వాత తెలంగాణ CM KCR నష్టనివారణ చర్యలను వేగవంతం చేశారు.


నేపాల్‌పై డ్రాగన్‌ పడగ!

రాజకీయ సంక్షోభంలో హిమాలయ రాజ్యం పట్టు పెంచుకొనేందుకు చైనా ప్రయత్నాలు నేపాల్‌కు చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రతినిధి బృందం పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న భారత్‌ రాజకీయ అస్థిరతకు చిరునామాగా మారిన హిమాలయ దేశం నేపాల్‌ మరోసారి సంక్షోభంలో చిక్కుకున్నది. పాలకపక్షం ‘నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ’లో (ఎన్‌సీపీ) కొంతకాలంగా కొనసాగుతున్న కుమ్ములాటల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ పార్లమెంట్‌ను రద్దు చేశారు. దీంతో మరోసారి రాజకీయ ప్రతిష్టంభన నెలకొన్నది. ఆ...


ఎమ్మారై, సీటీ స్కాన్‌ ఇక ఉచితం

గ్రేటర్‌లో 16 డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు 3 రోజుల్లో 8 కేంద్రాల్లో సేవలు హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మందులెన్ని వాడినా జ్వరం తగ్గడం లేదా..? ఆయాసం ఇబ్బంది పెడుతున్నదా.. డాక్టర్‌ సీటీ స్కాన్‌ చేయించాలన్నారా..? ఫీజు రూ. ఐదు వేలవుతుందని భయపడుతున్నారా? ఇకపై ఆ చింతే వద్దు. ఖరీదైన ఈ పరీక్షను ఉచితంగా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జాతీయ ఆరోగ్యమిషన్‌, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 16 రోగనిర్ధారణ కేంద్రాలను(మినీహబ్స్‌)...


తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

రామన్నపేట: మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన సీపీఎం మండల కమిటీ సభ్యు డు పొట్ల చెరువు రాములు (38)శనివారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేకపో వడంతో రాములు పెద్ద కుమార్తె గాయత్రి తండ్రికి తలకొరివి పెట్టింది. నివాళులర్పించిన నాయకులు రాములు భౌతికకాయంపై గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వీరమల్ల రాంనర్సింహగౌడ్‌ పూలమాలలు వేసినివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 5వేల...


హైవే పై అలర్ట్‌..

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారిపై ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 54 సోలార్‌ బిగ్గర్స్‌ ఏర్పాటు చేసిన అధికారులు 60 కిలో మీటర్ల పొడవున 254 ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు జాతీయ రహదారిపై అందుబాటులో 1033 టోల్‌ఫ్రీ బాక్సులు జాతీయ రహదారిపై జరుగుతున్న వరుస ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర...


ఏపీలో సినిమా థియేటర్లలో సందడి: ప్రెస్ రివ్యూ

రాష్ట్రంలోని మూడు నాలుగు జిల్లాల్లో సగానికి పైగా థియేటర్లు తెరవగా... మిగిలిన జిల్లాల్లో కూడా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది.


ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌కు అస్వస్థత

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు.


Hyderabad: హైదరాబాద్‌లో రెండు రోజులు జాగ్రత్త

ఓ వైపు కరోనా వైరస్ .. మరోవైపు కరోనా కొత్త స్ట్రయిన్‌తో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు చలికూడా ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.


సీఎం ద‌త్త‌పుత్రిక‌కు పెళ్లి కానుక‌గా వ‌జ్రాల నెక్లెస్

హైద‌రాబాద్ : ‌ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌త్త‌పుత్రిక ప్ర‌త్యూషకు పెళ్లి కానుక‌గా సీఎం స‌తీమ‌ణి శోభ‌మ్మ అరుదైన బ‌హుమ‌తిని అంద‌జేశారు. ఆదివారం ప్ర‌త్యూష‌ను పెండ్లి కూతురుగా ముస్తాబు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి శోభ‌మ్మ హాజ‌రై ప్ర‌త్యూష‌కు ప‌ట్టువ‌స్ర్తాలు, వ‌జ్రాల నెక్లెస్ బ‌హుక‌రించి ఆశీర్వ‌దించారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం మహిళా, శిశు సంక్షేమ శాఖ...


టీపీసీసీ రేస్: AICC కీలక నేతతో కోమటిరెడ్డి భేటీ

రేవంత్ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగిస్తారన్న సమయంలో మరోసారి కోమటిరెడ్డితో కీలక నేతల భేటీ ఆసక్తికరంగా మారింది.


‘టీకా’ ముసుగు.. ఖాతాఖాళీ!

సైబర్‌ కేటుగాళ్ల సరికొత్త వ్యూహం ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ వివరాలతో లూటీ అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సైబర్‌ కేటుగాళ్లు మరో సరికొత్త మోసానికి తెరలేపారు. కాలానుగుణంగా తమ వ్యూహాలకు పదును పెడుతూ అమాయకుల సొమ్ము కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా అంతానికి టీకాలు వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమైన వేళ దానిని ఆసరాగా చేసుకొని అమాయకుల నుంచి డబ్బు దండుకొనేందుకు ఈ బ్యాచ్‌లు ఏర్పాట్లుచేసుకుంటున్నాయి. టీకా వేసేందుకు మీ ఆధార్‌...


India Covid-19: కొత్తగా 20వేల కరోనా కేసులు నమోదు

దేశంలో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.


జనసేన ముఖ్యనేతతో వంగవీటి రాధా భేటీ.. పవన్ టూర్‌కు ముందు ఆసక్తికరం!

తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఆయన్ను రాధా కలవడం ఆసక్తికరంగా మారగా.. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని సమాచారం.


Trump: కీలక ఆర్థిక ప్యాకేజీ బిల్లుపై సంతకం చేసిన ట్రంప్... అమెరికాలో రాబోయే మార్పులేంటి?

Trump signs the Bill: డొనాల్డ్ ట్రంప్ మొండి ఘటమే కానీ అప్పుడప్పుడూ ఆయన మాట వింటారు. మరో నెల లోపే పదవి దిగిపోయే ఆయన... కీలక ఆర్థిక ప్యాకేజీ బిల్లుపై సంతకం చేసి మంచి పనిచేశారు.


చైనీయులను విమానాల్లో ఎక్కించవద్దు.. విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు!

కరోనా వైరస్ విషయంలో చైనా వ్యవహారశైలిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా తప్పుబడుతోంది.


అతివేగం.. ప్రాణాలు తీసింది

ఉప్పల్‌ : అతివేగం.. ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. వేగంగా బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు.. యూ టర్న్‌ వద్ద జేసీబీని ఢీకొని మృతి చెందారు. ఈ సంఘటన ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. ఎస్సై మైబెల్లి వివరాల ప్రకారం.. భువనగిరి జిల్లా సురేపల్లి ఆకుతోటబావి తండాకు చెందిన లకావత్‌ నరేశ్‌(22) ఇండస్‌ వీవా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే.. పోచారం గ్రామానికి చెందిన టంగుటూరి గణేశ్‌(20) ప్రైవేట్‌ జాబ్‌ చేస్తున్నాడు. వీరిద్దరు స్నేహితులు....


రైతులకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి హైదరాబాద్: రైతులకు సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలసి గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియంత్రిత సాగు విషయంలో కేసీఆర్ మొదటి నుంచి మొండిగా వ్యవహరించారని...


మరికొద్ది రోజుల్లో దేశంలో ఆక్స్‌ఫర్డ్ టీకా.. అక్కడ జనవరి 4న?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆక్స్‌ఫర్డ్ టీకా కోవిషీల్డ్ మరి కొద్ది రోజుల్లోనే అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి రానుంది. భారత్‌లో తొలి కరోనా టీకా ఇదే కానుంది.


సేవలకు.. రాజ పురస్కారం

20 సంవత్సరాలుగా ఏఎన్‌ఎంగా సుదీర్ఘ సేవలు ఏఎన్‌ఎం విజయలక్ష్మికి జాతీయ స్థాయిలో ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు పొందిన విజయలక్ష్మి సంగారెడ్డి మున్సిపాలిటీ : విద్యను అభ్యసించి ఒక స్థాయిలో ఉండి ఆ స్థానానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనే తపన అందరిలో ఉండదు. కొందరికి మాత్రమే ఉంటుంది. ఎంచుకున్న పనికి పూర్తగా న్యాయం చేసినప్పుడే ప్రశంసలతో పాటు మంచి గుర్తింపు లభిస్తుంది. అలాంటి ప్రశంసలు అందుకున్న వ్యక్తులలో ఒకరు సంగారెడ్డి...


Snow fall at Vaishno Devi: వైష్ణో దేవి ఆలయం చెంత మంచు తుఫాను. వీడియో...

Snow fall at Vaishno Devi Temple: అసలే హిమాలయాలు. వాటికి చలికాలం తోడైంది. దాంతో... మంచు తుఫాను కురుస్తూ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.


చిలీలో భారీ భూకంపం

చిలీ‌: దక్షిణ అమెరికా దేశమైన చిలీలో భారీ భూకంపం వచ్చింది. నిన్న రాత్రి దక్షిణ చిలీలోని లాస్‌ లాగోస్‌ తీరప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత భూకంపలేఖినిపై 6.8గా నమోదయ్యింది. కోరల్‌ నగరానికి 140 కి.మీ. దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రం ఉన్నదని యూరోపియన్‌ మెడిటేరియన్‌ సీస్మోలాజికల్‌ సెంటర్‌ (ఈఎంఎస్‌సీ) వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ చిలీ తీరప్రాంతంలోని అనేక నగరాల్లో భూ ప్రకంపణలు వచ్చాయి. లాఅరౌకనియా, లాస్‌రియోస్‌, లాస్‌లాగోస్‌,...


మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి

మరో ఆరుగురు సభ్యుల నియామకం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరో ఆరుగురిని కమిషన్‌ సభ్యులుగా ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌, సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజునుంచి ఐదేండ్లపాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో...


ఖైదీలకు కళ్లజోడూ, నీళ్లు తాగడానికి స్ట్రాలు ఇమ్మంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు?

ఈమధ్య కాలంలో ఇండియాలోని జైలు అధికారులు ఖైదీల పట్ల మరింత నిర్దయగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి


హక్కులు దక్కాలంటే వర్గీకరణ జరగాలి

ఎస్సీ వర్గీకరణ కోసం దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతాం తెలంగాణ అసెంబ్లీ చేసినట్లు అన్ని రాష్ర్టాల్లో తీర్మానాలు చేయాలి మాజీ ఎంపీ మందా జగన్నాథం బంజారాహిల్స్‌ : మాదిగలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక దళిత కులాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు దక్కాలంటే ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే అని మాజీ ఎంపీ మందా జగన్నాథం అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన ఇతర రాష్ర్టాలు తీర్మానాలు చేసేలా...


Mother Murder: కూతుర్ని ఆ పనిచేయమన్న తల్లి.. చంపేసిన కొడుకు

రెండేళ్లుగా తల్లి ఇతరులతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోంది. కొడుకు పలుసార్లు మందలించినా తల్లి తీరు మారలేదు.అంతేకాకుండా ఆమె తన మైనర్ కూతుర్ని కూడా అదేపని చేయాలంది.


Andhra Pradesh: అంత్యక్రియలకు వెళ్లిన 25 మంది ఆస్పత్రి పాలు.. అసలేం జరిగింది..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నాటుసారా కలకలం రేగింది. 25 మంది అస్వస్థతకు గురవడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.


నేటి నుంచే ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో కోవిడ్ టీకా డ్రై రన్

దేశంలో కరోనా వైరస్‌ను నిలువరించే తొలి టీకా మరి కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది.


Farm Bills 2020: ఢిల్లీలో రైతులుకు కేరళ రైతుల బహుమతి!

Farm Bills 2020: భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై నిరసనగా వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్, హరియాణ, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రైతులు రాజధాని సరిహద్దుల వద్ద క్యాంపులు వేసుకుని మరి నిరసన వ్యక్తంచేస్తున్నారు. వీరికి స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే.


వచ్చే ఏడాది నాలుగు గ్రహణాలు.. భారత్‌లో దర్శనమిచ్చేవి ఎన్నంటే?

ఈ ఏడాది మొత్తం ఆరు గ్రహణాలు ఏర్పడగా.. ఇందులో నాలుగు చంద్రగ్రహణాలు ఉన్నాయి.


నేడు సీఎం దత్తపుత్రిక వివాహం

రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ లూర్ధుమాత చర్చిలో ప్రత్యూష పెండ్లి వేడుక పట్టువస్ర్తాలు, డైమండ్‌ నెక్లెస్‌ బహూకరించిన సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మహిళా సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం సోమవారం ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ లూర్ధుమాత చర్చిలో జరుగుతుంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, కమిషనర్‌ దివ్యదేవరాజన్‌...


అనంతపురం: వైసీపీ ఎమ్మెల్యేకు జేసీ ట్విస్ట్.. కేసు పెట్టనంటూనే

తాడిపత్రిలో పొలిటికల్ హైడ్రామాలో ట్విస్ట్.. ఓ అర్జీ, సీసీ ఫుటేజీ, పెన్‌ డ్రైవ్ మాత్రమే పోలీసులకు ఇచ్చానని చెబుతున్నారు. తనను ఫిర్యాదుదారుడిగా పరిగణించొద్దని పోలీసులను కోరారు.


రైతుబంధు చెల్లింపులు నేటి నుంచే

61.49 లక్షల మందికి రూ 7,515 కోట్లు నేరుగా రైతు ఖాతాల్లోకి యాసంగి సాయం ప్రతిరైతుకూ పంట సాయమందించాలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశం స్థానిక పరిస్థితుల మేరకు పంటల సాగు రైతుకు సకాలంలో ఎరువులు, విత్తనాలు కొత్త వంగడాలపై పరిశోధనలు జరగాలి అర్హులైన అందరికీ రైతుబీమా వర్తింపు వ్యవసాయశాఖ సమీక్షలో అభిప్రాయాలు ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నం పెట్టే రైతన్నకు ఆసరాగా నిలిచే రైతుబంధు చెల్లింపులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 61.49...


ఏపీలో కరోనా కలకలం: యూకే నుంచి వచ్చిన ఆరుగురికి వైరస్.. ఆ టెన్షన్ వెంటాడుతోంది

తూర్పు గోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరి చొప్పున కరోనా నిర్ధారణ కాగా గుంటూరులో ఇద్దరికీ కరోనా సోకింది.


కొత్త ఏడాదిలో బంగారం ధర​ రూ.63 వేలు

స్టిమ్యులస్ ప్యాకేజీలతో బంగారానికి డిమాండ్ తగ్గిన వడ్డీరేట్లు, ఈజీ లిక్విడిటీ సపోర్ట్ ఆగస్ట్‌‌లో 56 వేలు తాకిన గోల్డ్ ముంబై : కొత్త ఏడాదిలో కూడా బంగారం ధర పరుగులు పెట్టనుంది. 10 గ్రాముల బంగారం ధర వచ్చే ఏడాది రూ.63 వేలను తాకుతుందనే అంచనాలున్నాయి. అమెరికన్ డాలర్ బలహీనపడుతుండటం, తాజాగా ప్రభుత్వాలు ప్రకటిస్తోన్న స్టిమ్యులస్...


పీసీసీ ఎంపిక తీరుపై సీతక్క అసంతృప్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌లో పీసీసీ ఎంపిక చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడంలేదు. రేవంత్‌రెడ్డికి పీసీసీ ఖరారైందన్న ప్రచారంపై అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సీనియర్‌ నేత వీహెచ్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయగా, తాజాగా అదే బాటలో పీసీసీ ఎంపిక విధానంపై ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. పీసీసీ ఎంపికలో తన అభిప్రాయం తీసులేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ శాసనసభాపక్షంలో సభ్యురాలినే అయినా,...


తిరుపతి ఉప ఎన్నిక: వైసీపీ అదిరిపోయే ప్లాన్.. ఏకంగా రంగంలోకి సీఎం జగన్

తిరుపతి ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుని వైఎస్సార్‌సీపీ తమ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను రంగంలోకి దించింది.


బ్రిటన్‌ నుంచి వచ్చిన ఆ 154 మంది ఎక్కడ?

ఈ నెల 9 నుంచి ఇప్పటి‌వ‌రకు మొత్తం 1,216 మంది బ్రిటన్‌ నుంచి తెలం‌గా‌ణకు వచ్చారు. ఇందులో 154 మంది జాడ తెలి‌య‌డం‌లేదు


Telangana Covid-19: రాష్ట్రంలో నిన్న భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిన్న కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గిం


టీకా Xతూటా

పేద దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ కత్తి మీద సాము యుద్ధాలు.. అస్థిరత.. వదంతులతో అవాంతరాలు పాక్‌లో 8 ఏండ్లలో 100 మంది సిబ్బంది హత్య వ్యాక్సినేషన్‌ కొనసాగకుండా మిలిటెంట్ల హింస ఇప్పటికీ పాక్‌, అఫ్ఘన్‌, నైజీరియాలో పోలియో రష్యా, అమెరికాతో పాటు యూరప్‌లో కొన్ని దేశాల్లో కరోనా టీకా పంపిణీ మొదలైంది. పెద్ద దేశాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సజావుగానే సాగుతుండవచ్చు. కానీ, పేద దేశాల్లో ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. టీకాలు కొనడం, భద్రపరచడం, అధ్వాన్న రహదారులు,...


వైద్యరంగంలో మారుతున్న ట్రెండ్‌

హైదరాబాద్‌ : కరోనా పుణ్యమా అని అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు జరిగినట్లే వైద్యం రంగమూ సరికొత్త పుంతలు తొక్కుతున్నది. ఆన్‌లైన్‌ షాపింగే కాదు... ఆన్‌లైన్‌ మెడిసిన్‌కూ నానాటికి ఆదరణ పెరుగుతున్నది. ఈ విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉన్నా.. కొవిడ్‌ పరిస్థితుల కారణంగా ‘వైద్యం’ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒక్క క్లిక్‌తో డాక్టర్‌ కన్సల్టేషన్‌ దగ్గర నుంచి వైద్యపరీక్షలు, మందుల కొనుగోల వరకూ అన్నీ గుమ్మం వద్దకే వచ్చేస్తున్నాయి. ఈ సేవలు అందించేందుకు...


‘పట్టణ ప్రగతి’కి నిధులు

వేములవాడ మున్సిపల్‌కు 3.78కోట్లు మంజూరు 1.80కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు సర్వత్రా హర్షం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి నిధులు మంజూరు చేసింది. జనాభా ప్రాతిపదికన ప్రతి నెలా వేములవాడ మున్సిపల్‌కు 42లక్షలు విడుదల చేస్తున్నది. ఇప్పటి వరకు గడిచిన తొమ్మిది నెలల్లో 3.78కోట్లు సమకూర్చింది. 2కోట్ల వరకు నిధులను ఇతరత్రా అవసరాలకు వినియోగించింది. 1.80కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఇప్పటికే టెండర్లు...


టీడీపీ సంచలన నిర్ణయం.. మూడు రోజుల పాటూ

టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది.. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సారి కాస్త వినూత్నంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది.


కోలుకున్న రజినీ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రముఖ సినీనటుడు రజినీకాంత్‌ (70) అనారోగ్యం నుంచి కోలుకొన్నారు. ఆదివారం మధ్యాహ్నం హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. తమిళ సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్‌ కోసం ఈ నెల 13న హైదరాబాద్‌ వచ్చిన రజినీకాంత్‌ రక్తపోటు సమస్యతో ఈ నెల 25 ఉదయం జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రజినీకాంత్‌కు రక్తపోటు అదుపులోకి రావడంతో ఆయన పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. వారం పాటు పూర్తి...


Driver less train: ఇవాళ దేశపు తొలి డ్రైవర్ రహిత ట్రైన్ ప్రారంభం

Driver less train: భారతదేశపు తొలి డ్రైవర్ రహిత రైలు ఇవాళ పట్టాలెక్కనుంది. ఢిల్లీ మెట్రో మరో అరుదైన ఘనతను సాధించనుంది. దేశపు తొలి డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.


తెలంగాణలో కొత్త స్ట్రెయిన్...యూకే నుంచి వచ్చిన మరో ఇద్దరికి పాజిటివ్

ఇప్పటికే యూకే నుంచి వచ్చినవారిలో 20మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో వారి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. వారందర్నీ ప్రత్యేక వార్డుల్లో ఉంచారు.


సీఎం పదవిపై నితీశ్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీకి పరోక్షంగా హెచ్చరికలు!

అరుణాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు బిహార్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి.


మహిళలపై దాడులు బాధాకరం

జస్టిస్‌ చంద్రయ్య సన్మాన సభలో మంత్రి ఈటల హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గొప్ప ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో నేటికీ మహిళలపై దాడులు జరుగడం బాధాకరమని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం మానవహక్కుల సంఘం చైర్మన్‌ జస్టిస్‌ జీ చంద్రయ్య సన్మాన సభ లో ఈటల ప్రసంగించారు. మారుమూల జిల్లాలో పుట్టిన చంద్ర య్య.. జస్టిస్‌గా ప్రజలకు విశిష్ట సేవలందించారని ప్రశంసించారు. తెలంగాణలో హక్కులను కాపాడటంతో ఇదే ఒరవడి కొనసాగించాలని ఆకాంక్షించారు. నెల్సన్‌ మండేలా...


తాగి పట్టుబడితే 6నెలల జైలు, జరిమానా..!

హైదరాబాద్‌ : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేసి పోలీసులకు పట్టుబడితే.. ఇక మందుబాబులకు దాదాపు 6 నెలల జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా తప్పదు .. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో డిసెంబర్‌ నెలలో మొత్తం 2,351 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ అంశంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టుబడిన 2,351 మంది పై కోర్టుల్లో చార్జీషీటులను దాఖలు...


అమెరికా: కరోనా ఉపశమనం, వ్యయం ప్యాకేజీ బిల్లుపై ట్రంప్ సంతకం: Newsreel

ఈ ప్యాకేజీలో భాగంగా నిరుద్యోగులకు తక్షణం చెల్లింపులు జరుపుతారు. అందుకే ఫ్లోరిడాలో ఉన్న ట్రంప్ చివరికి దీనిపై సంతకం చేయాలని నిర్ణయించారు.